Friday, January 28, 2011

ప్రేమించే ...

మనిషికి మనసే లేనప్పుడు....రాని మార్పుకు మూహర్తమెందుకు ?మనసులో మమతలే లేనప్పుడు...
మేమున్నామంటూ మాటలెందుకు ?

సాయం చేసే హృదయమే లేనప్పుడు...
పెట్టెల నిండ డబ్బులెందుకు ?

ఆలోచనలో అందం లేనప్పుడు....
దేహం పై రంగులెందుకు ?

కన్నీటిని తుడిచే చేయి లేనప్పుడు...
కపట ప్రేమతో కల్మషమెందుకు...?

ప్రేమించే అంతరాత్మ లేనప్పుడు...
వ్యర్ధమై ఈ బ్రతుకెందుకు...!

No comments:

Post a Comment